Telangana Election Results : KCR Unanimously Elected As TRSLP Leader | Oneindia Telugu

2018-12-12 651

Telangana election results 2018 : TRS supremo kcr will take oath as the chief minister of Telangana tomorrow. Meanwhile He elected as TRSLP president by the MLAs. It is also learned that KCR will form the cabinet on the same day.
#TelanganaElectionResults
#TRSLPLeader
#kcr
#trs
#Telanganachiefminister
#AssemblyElections

తెలంగాణ రాష్ట్ర సమితి శాసన సభా పక్ష నేతగా ఆ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఎన్నికయ్యారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ 88 సీట్లు గెలుచుకున్న విషయం తెలిసిందే. 119 అసెంబ్లీ స్థానాలు ఉన్న తెలంగాణలో మేజిక్ ఫిగర్ 60. 2014లో టీఆర్ఎస్ 63 స్థానాలు గెలుచుకోవడంతో పాటు దాదాపు ఇరవై ఐదు మందికి పైగా ఆ తర్వాత ఇతర పార్టీల నుంచి చేరారు. గెలిచిన తెరాస సభ్యులు ప్రగతి భవన్‌లో బుధవారం సమావేశమయ్యారు. ఈ సమావేశానికి పార్టీ తరఫున గెలిచిన 88 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ఎల్పీగా కేసీఆర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రొటెం స్పీకర్‌ను కూడా అభ్యర్థులు ఎన్నుకోనున్నారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు ఈ సందర్భంగా కేసీఆర్‌ దిశానిర్దేశం చేశారు.